నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లికి చెందిన బస్సును విజయవాడలోని భవానీపురం వద్ద కొందరు యువకులు నిలిపివేశారు. ద్విచక్రవాహనాలను రోడ్డుకు అడ్డుగా నిలిపివేసి హంగామా సృష్టించారు. తమ వాహనాలకు దారివ్వకుండా బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని దాడి చేశారు. సుమారు 50 మంది యువకులంతా మూకుమ్మడిగా... బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. కిలోమీటరు మేర వెంబడించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. డ్రైవర్‌పై దాడి చేసి టిమ్, చేతిలో ఉన్న నగదు ఎత్తుకెళ్లారు. డ్రైవర్ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు... కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు..
ఏపీలో దారుణం... తెలంగాణ ఆర్టీసీ బస్సుపై యువకుల దాడి - telangana rtc
విజయవాడలో కొందరు యువకులు హల్‌చల్ చేశారు. అర్ధరాత్రి ప్రయాణికులను భయాందోళనలకు గురి చేశారు. తెలంగాణ నార్కట్ పల్లికి చెందిన బస్సు అద్దాలు ధ్వంసం చేశారు.
తెలంగాణ ఆర్టీసీ బస్సు