తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఆకాశమంతా మాదే! - face to face

విమానమంటే సినిమాలు, టీవీల్లో చూసుకునే రోజుల్లోనే పైలట్​గా ఎంపికైన ధీరవనిత ఆమె. మహిళలు ఆ ఉద్యోగం చేయలేరన్న విమర్శలకు నోరు మూయించిన ధీశాలి. ఎంతో మంది మహిళలకు కొత్త బాట చూపిన మార్గదర్శి. 1980లోనే పైలట్ శిక్షణ పూర్తి చేసిన కెప్టెన్ మమతతో మహిళా దినోత్సవం సందర్భంగా ఈటీవీభారత్‌ చిట్‌చాట్...

ఆకాశమంతా మాదే!

By

Published : Mar 8, 2019, 1:10 PM IST

ఆకాశమంతా మాదే!
ఆకాశంలో సగం కాదు.. ఆకాశమంతా అని నిరూపిస్తూ... తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి మహిళా పైలట్‌గా 1980లోనే గుర్తింపు సాధించారు కెప్టెన్‌ మమత. ఆడవారికి అంతగా ప్రోత్సాహం లేని రోజుల్లోనే ఈ శిక్షణ పూర్తి చేసి.. తనలా విమానాలు నడపాలనుకునే వారి కోసం ఏకంగా ఫ్లైటెక్‌ పేరుతో ఓ ఏవియేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ని స్థాపించి వేలాది మందికి శిక్షణనిచ్చారు. ఆమె తన ప్రయాణంలో ఎలాంటి అవాంతరాలను ఎదుర్కొన్నారు... పైలట్‌ కావాలన్న కాంక్ష ఎప్పుడు ప్రారంభమైందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details