తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తల్లి కాలేకపోయానని ఆవేదనతో ఆత్మహత్య - తల్లి కాలేకపోయానని ఆవేదనతో ఆత్మహత్య

ఆప్యాయంగా చూసుకునే భర్త... ఎంతో సంతోషంగా సాగుతున్న దాంపత్య జీవితం... కానీ ఆమెకు అమ్మను కాలేకపోయాననే వెలితిని తీర్చలేదు. ఏడేళ్లైనా ఇంకా సంతానభాగ్యం కలగట్లేదనే బాధ తనను దహించేస్తుంటే తట్టుకోలేక తనువు చాలించింది ఓ మహిళ.

WOMEN SUCIDE

By

Published : Jun 15, 2019, 5:14 PM IST

సంతానం కలగట్లేదని మనస్థాపానికి గురై ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన రామలింగేశ్వర్‌రావు, అమూల్య దంపతులు ఉద్యోగరీత్యా హైదరాబాద్​ మియాపూర్​లోని గోపాల్​రావునగర్ కాలనీలో నివాసముంటున్నారు. వీరికి 2012లో వివాహం జరిగింది. పెళ్లై ఏడేళ్లు గడుస్తున్నా సంతానం కలుగలేదనే బాధతో అమూల్య ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ... అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆవేదనతో ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details