వరంగల్‌లో చిన్నారిపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని మైత్రివనం వద్ద మహిళలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నిందితున్ని వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. చిన్నపిల్లలు, ఆడవాళ్లపై ఆత్యాచారాలకు పాల్పడే క్రూరులను ఆలస్యం చేయకుండా కఠినంగా శిక్షించాలని మహిళలు కోరారు. నిరసనతో మైత్రివనం వద్ద రాకపోకలకు భారీగా అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు బుజ్జగించినా వినకపోవటం వల్ల అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
'చిన్నారిని చిదిమేసిన ఉన్మాదిని ఉరి తీయాలి' - 'నిందితున్ని వెంటనే ఉరితీయాలి'
చిన్నపిల్లలు, మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న క్రూరులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ మైత్రివనంలో టీవీ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
WOMEN PROTESTING AGAINST WARANGAL CHILD RAPE AT HYDERABAD MYTRIVANAM