తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రైతుబిడ్డ: కళ్లు చెమర్చిన కలెక్టరమ్మ!

తమిళనాడు సేలం జిల్లా పాలనాధికారి గొంతు కన్నీటితో మూగబోయింది. బదిలీపై వెళ్తున్న తనకు రైతులు చేసిన సన్మానం కన్నీరు తెప్పించిందని తెలిపారు ఆ ఐఏఎస్.

By

Published : Jun 30, 2019, 5:58 PM IST

Updated : Jun 30, 2019, 10:13 PM IST

రైతుల కోసం: కళ్లు చెమర్చిన కలెక్టరమ్మ రోహిణి!

తనను సన్మానించే కర్షకులను చూసి ఆ కలెక్టర్ కళ్లు చెమ్మగిల్లాయి. తాను పనిచేసిన జిల్లాలోని వ్యవసాయదారులు చేసిన సన్మానం తనకు ప్రత్యేకమైనదని వెల్లడించారు.

రోహిణి ఐఏఎస్, మొన్నటి వరకూ తమిళనాడు సేలం జిల్లా కలెక్టర్. రెండేళ్ల కిందట సేలం జిల్లా మొట్టమొదటి మహిళా పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టారు. సేలం జిల్లాకు మొత్తంగా 171 వ కలెక్టర్. రోహిణిని ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది. బదిలీపై వెళ్తున్న రోహిణికి జిల్లా వాసులు సన్మానాలు చేశారు.

ఓ సన్మానంలో మాత్రం రోహిణి కంటతడి పెట్టారు. ఐఏఎస్​నే కంటతడి పెట్టించిన ఆ సన్మానం రైతులు చేశారు. స్వతహాగా రైతు కుటుంబానికి చెందిన వారు కావడం, రెండేళ్లుగా రైతులతో ఉన్న అనుబంధం కంటతడి పెట్టించిందన్నారు రోహిణి.

మహారాష్ట్ర సోలాపూర్​కు చెందిన రోహిణి వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. తాను వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తినని, రైతు సమస్యల పట్ల ఆసక్తి కలిగి ఉంటానని తన గౌరవార్థం ఏర్పాటు చేసిన సభలో రోహిణి వ్యాఖ్యానించారు. తనను అనేక సార్లు శాలువాలతో సత్కరించారని, కానీ రైతుల సన్మానం కన్నీరు తెప్పించిందన్నారు.

రైతుల కోసం: కళ్లు చెమర్చిన కలెక్టరమ్మ రోహిణి!

ఇదీ చూడండి: ఎస్సీని ప్రేమించిన యువతిపై కర్రలతో దాడి

Last Updated : Jun 30, 2019, 10:13 PM IST

ABOUT THE AUTHOR

...view details