ముఖ్యమంత్రి కేసీఆర్ 16 సీట్లు గెలవాలి అనుకోవడం తెలంగాణ ప్రయోజనాల కోసం కాదని.. మరో మిత్రుడు జగన్‌కు వచ్చిన స్థానాలతో కలుపుకొని మోదీని ప్రధాని చేయడమే లక్ష్యమని కాంగ్రెస్ ప్రచార తార విజయశాంతి విమర్శించారు. మెదక్ పార్లమెంట్ హస్తం పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ తరఫున పటాన్చెరులో ఆమె రోడ్ షో నిర్వహించారు. ప్రజల అమాయకత్వంతో ఆడుకుంటున్న కేసీఆర్.. ఇది మీకు న్యాయమా అని రాములమ్మ ప్రశ్నించారు. మోదీకి గులాంగిరి చేయడమే సీఎం నిజస్వరూపమని ధ్వజమెత్తారు.
కేసీఆర్.. ఇది మీకు న్యాయమా: విజయశాంతి - MODI
" మోదీకి గులాంగిరి చేయడమే కేసీఆర్ నిజస్వరూపం... పేద ప్రజల అమాయకత్వాలతో ఆడుకుంటున్న కేసీఆర్.. ఇది మీకు న్యాయమా..? " - విజయశాంతి
రోడ్‌షోలో విజయశాంతి