తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'మేం మళ్లీ ఉద్యమాలు చేయాల్సి వస్తుందేమో' - విజయశాంతి

నిరసనలు, ఉద్యమాలు చేయకుండానే తెలంగాణ ఏర్పడిందా.. అని కాంగ్రెస్​ ప్రచార కమిటీ ఛైర్​పర్సన్​ విజయశాంతి ముఖ్యమంత్రి కేసీఆర్​ను ప్రశ్నించారు. గృహనిర్బంధంలో ఉన్న మందకృష్ణ మాదిగను కలిసి సంఘీభావం తెలిపారు. కేసీఆర్​ ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు.

దొరగారు మేం మళ్లీ ఉద్యమాలు చేయాల్సి వస్తుందేమో..!

By

Published : Apr 19, 2019, 1:07 AM IST

ఎస్సీ, ఎస్టీలంటే కేసీఆర్​కు చిన్నచూపని.. ఆయన అధికారంలో ఉన్నంత వరకు వారికి న్యాయం జరగదని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్​పర్సన్​ విజయశాంతి ధ్వజమెత్తారు. గృహ నిర్బంధంలో ఉన్న ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను కలిసి సంఘీభావం తెలిపారు. ఉద్యమాలు, నిరసనలు తెలపడం తప్పా అని... ఉద్యమాలు చేయకుండానే తెలంగాణ సాధించామా అంటూ కేసీఆర్​ను ప్రశ్నించారు. అంబేడ్కర్​ విగ్రహాన్ని మరలా ప్రతిష్ఠిచి, చేసిన తప్పిదానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు.

విజయశాంతి రాక తనకెంతో ధైర్యాన్నిచ్చిందని మందకృష్ణ అన్నారు. ఈనెల 22 వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. అంబేడ్కర్​వాదుల గర్జన నిర్వహించి కేసీఆర్​ నిరంకుశ, నియంతృత్వ విధానాలను ఎండగడతామని హెచ్చరించారు.

మేం మళ్లీ ఉద్యమాలు చేయాల్సి వస్తుందేమో..!
ఇవీ చూడండి: ఎస్సీ, ఎస్టీలే కాకుండా అన్నివర్గాలూ నిర్వహించాలి

ABOUT THE AUTHOR

...view details