తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అంతిమ యాత్ర పథకానికి వెంకయ్య ప్రశంస - venkayya

కరీంనగర్ నగర పాలక సంస్థ చేపట్టనున్న రూపాయికే 'అంతిమయాత్ర' పథకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. అంతిమ సంస్కారాలు చేపట్టడం గొప్ప విషయమని ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు.

అంతిమ యాత్ర పథకానికి వెంకయ్య ప్రశంస

By

Published : May 21, 2019, 1:16 PM IST

కరీంనగర్‌ నగర పాలక సంస్థ ప్రవేశపెట్టిన రూపాయికే 'అంతిమ యాత్ర' పథకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. జూన్ 15న ప్రారంభం కానున్న ఈ పథకాన్ని కుల, మత, పేద, ధనిక వర్గాలకు అతీతంగా అమలు చేయడంపై ట్విట్టర్​ వేదికగా ప్రశంసించారు. అంతిమ సంస్కారాల సమయంలో యాభై మంది కుటుంబ సభ్యులకు భోజనం పెట్టడం గొప్ప విషయమని పేర్కొన్నారు. మరో ట్వీట్​లో కరీంనగర్​ మేయర్​ ఈ పథకానికి రూ.1.5 కోట్లు కేటాయించడంపై సర్దార్​ రవీందర్​ సింగ్​ను వెంకయ్యనాయుడు మెచ్చుకున్నారు.

కరీంనగర్ మేయర్​, ఎమ్మెల్యే, కార్పోరేటర్లకు శుభాకాంక్షలు: కేటీఆర్​

అంతిమయాత్ర పథకం ఏర్పాటు చేయడంపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. పేదలకు ఇది ఎంతో ఉపయోగకరం అంటూ ట్వీట్​ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details