లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వనున్నట్లు ప్రకటించింది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓబీసీ పార్టీ మహాన్ దళ్. రాష్ట్ర కాంగ్రెస్ తూర్పు, పశ్చిమ కార్యదర్శులు ప్రియాంకగాంధీ, సింధియాల సమక్షంలో తమ నిర్ణయం వెలువరించింది.
"మహాన్ దళ్ అధినేత కేశవ్దేవ్ మౌర్యకు స్వాగతం. ఐక్యతతో ఎన్నికలను ఎదుర్కొందాం. అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లాలన్నది రాహుల్ గాంధీ ఆకాంక్ష."-ప్రియాంక గాంధీ