స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపును వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్వాగతించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు, మండల పరిషత్తు అధ్యక్షులు, జిల్లా పరిషత్తు ఛైర్మన్ల ఎంపికకు మధ్య 40 రోజులు సమయం ఉంటుందని అఖిలపక్షం స్పష్టం చేసింది. ఈ మధ్యలో బేరసారాలకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలిసి విన్నవిన్నవించింది. డబ్బు, పదవులను ఆశ చూపి ఎంపీటీసీ, జడ్పీటీసీలను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.
సాంకేతిక పరంగా ఓట్ల లెక్కింపు పూర్తికాగానే ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌ల ఎన్నిక జరపడానికి... గత ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీకాలం అడ్డు వస్తోంది. లెక్కింపు వాయిదా వేయడం ఒకటే మార్గంగా భావించిన రాష్ట్ర ఎన్నికల సంఘం... ప్రతిపక్షాల వినతిపై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.