తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రాజ్ భవన్​లో వైభవంగా ఉగాది సంబురాలు.. - రాజ్ భవన్​లో వైభవంగా ఉగాది వేడుకలు

వికారినామ సంవత్సరం షడ్రుచుల మిళితంగా ఉంటుందని వేద పండితులు సూచిస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా కాకుండా కాలం మనల్ని పరీక్షిస్తుందని... అందరూ సంయమనంతో సమస్యలను అవగాహన చేసుకుంటూ వెళ్లాలన్నారు. పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని పంచాంగం చెబుతుందని సెలవిస్తున్నారు పండితులు.

రాజ్ భవన్​లో వైభవంగా ఉగాది వేడుకలు

By

Published : Apr 6, 2019, 5:07 AM IST

Updated : Apr 6, 2019, 8:28 AM IST

వికారి నామ సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. రాజ్ భవన్​లో ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. గవర్నర్ దంపతులతో పాటు మండలి ఇన్​ఛార్జీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, సీఎస్ ఎస్కే జోషి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చీకటి తర్వాత వెలుగు వస్తుందని... అందరూ స్థితప్రజ్ఞతతో మెలగాలని గవర్నర్​ సూచించారు.

రాజ్ భవన్​లో వైభవంగా ఉగాది వేడుకలు
షడ్రుచుల మిళితం...

శ్రీ విద్యా శ్రీధరశర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా ఉన్నాయని... అయితే ఎప్పుడు పడతాయో తెలియదని పండితులు తెలిపారు. మధ్య భారతంలో ఎక్కువగా పడతాయని... ఉపద్రవాలు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. పత్రికా, క్రీడా రంగాలకు చెందిన వారికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందన్నారు. ఉగాది వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి.

ఇదీ చదవండి: సివిల్స్​లో మిర్యాలగూడ వాసికి 7వ ర్యాంకు

Last Updated : Apr 6, 2019, 8:28 AM IST

ABOUT THE AUTHOR

...view details