ఉగాది వేడుకలను ఉత్తర్‌ప్రదేశ్‌లోని తెలుగు అసోసియేషన్ లక్నోలో ఘనంగా నిర్వహించింది. నగరంలోని గోమతి నగర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు వారందరు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఐఏఎస్ అధికారులు రామిరెడ్డి, జితేంద్ర కుమార్, ఎన్నికల కమిషన్ చీఫ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
సాయంత్రం వేళ.. వరంగల్ కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ తెలుగు సంస్కృతిని చాటారు. కూచిపూడి నృత్యాలతో పాటు ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.