తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఇంద్రకీలాద్రి హుండీ చోరీ కేసులో మరో ఇద్దరి అరెస్టు - chori

ఇంద్ర కీలాద్రి అమ్మవారి హుండీ లెక్కింపు చోరీ కేసులు మరో ఇద్దరి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇంద్రకీలాద్రి అమ్మవారి హుండీ

By

Published : Jun 6, 2019, 5:23 PM IST

అమ్మవారి హుండీ చోరీ కేసులో మరో ఇద్దరి అరెస్టు

విజయవాడ దుర్గగుడి హుండీ లెక్కింపులో చోరీకి పాల్పడిన కేసు మరో మలుపు తిరిగింది. సింహాచలం, అన్నపూర్ణతోపాటు మరో ఇద్దరి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సింహాచలం బంగారంతోపాటు రూ.10 వేలు చోరీ చేసినట్లు విచారణలో తేలింది. చోరీ చేసిన నగదును దుర్గారావు అనే మరో ఉద్యోగికి అందించినట్లు తెలిసింది. కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఉదంతంతో దుర్గగుడిలో నిఘాను మరింత పటిష్ఠం చేస్తామని ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. హుండీల లెక్కింపులో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. బంగారం, నగదు చోరీ జరిగినా గుర్తించని భద్రతాసిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చూడండి : ఆలయంలో హుండీలను ఎత్తుకెళ్లిన దొంగలు

ABOUT THE AUTHOR

...view details