తెలంగాణ

telangana

ETV Bharat / briefs

"గోడ నిర్మాణానికి రక్షణశాఖ నిధులా..?"

మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ నిధులు మంజూరు చేయడంపై కాంగ్రెస్​ చట్టసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రక్షణ నిధులను దురుపయోగం చేస్తున్నారని ఆగ్రహించారు.

By

Published : Mar 27, 2019, 6:51 AM IST

"గోడ నిర్మాణానికి రక్షణశాఖ నిధులు కుదరవు"

మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణంపై డెమొక్రాట్ల ఆగ్రహం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఎన్నికల వాగ్దానమైన సరిహద్దు గోడ నిర్మాణానికి మరో సవాలు ఎదురైంది. రక్షణ సంస్థ పెంటగాన్​ గోడ నిర్మాణానికి బిలియన్​ డాలర్ల నిధులు కేటాయించడంపై చట్టసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రక్షణశాఖ నిధులు ఎలా వాడతారని ప్రశ్నించారు.

ప్రతిపక్ష డెమొక్రాట్ల నేతృత్వంలోని కమిటీ 'ద హౌస్​ ఆర్మ్​డ్​ సర్వీసెస్​' దీనిని వ్యతిరేకించింది. ఈ చర్యను అనుమతించేది లేదని తేల్చిచెప్పింది.

కాంగ్రెస్​ను, ప్రతిపక్షాలను మోసం చేసేందుకు రక్షణశాఖ ప్రయత్నిస్తోంది. అనవసరమైన గోడ నిర్మాణానికి రక్షణశాఖ నిధులను మళ్లించాలని నిర్ణయించింది. - ఆడమ్​ స్మిత్​, ద హౌస్​ ఆఫ్​ ఆర్మ్​డ్​ సర్వీసెస్​ కమిటీ ఛైర్మన్

రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం చట్టసభ్యులను, రక్షణశాఖను వాడుకుంటుందని కమిటీ ఆరోపించింది. గోడ నిర్మాణం బదులు సైన్యం శక్తి పెంచుకునేలా, రక్షణశాఖను బలపరుచుకునేందుకు ఈ నిధులను వినియోగించాలని కోరింది. రాజ్యాంగాన్ని రక్షించే విధంగా కాంగ్రెస్​ వ్యవహరిస్తుందని కమిటీ వెల్లడించింది.

సరిహద్దు గోడ నిర్మాణానికి బిలియన్ డాలర్ల నిధుల్ని అందించే దస్త్రంపై అమెరికా రక్షణ సంస్థ తాత్కాలిక ఛైర్మన్ పాట్రిక్ షనహన్ నిన్న సంతకం చేశారు. 92 కిలోమీటర్ల మేర, 18 అడుగుల ఎత్తైన కంచె, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, లైటింగ్ తదితర ఏర్పాట్ల కోసం ఈ నిధుల్ని కోరింది అమెరికా అంతర్గత భద్రతా విభాగం

ABOUT THE AUTHOR

...view details