తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'ట్రంప్​ ఆదేశాల మేరకే ఇరాక్​పై రాకెట్​ దాడి' - ఇరాక్​ రాజధాని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్​ దాడిపై అమెరికా

ఇరాన్​ ఉన్నతస్థాయి​ కమాండర్​, నిఘా విభాగాధిపతి ఖాసీం సోలేమనీని మట్టుబెట్టాలని ట్రంప్​ ఆదేశించినట్లు ప్రకటించింది అమెరికా  రక్షణ విభాగం పెంటగాన్​. విదేశాల్లోని అగ్రరాజ్య పౌరులను కాపాడేందుకు నిర్ణయాత్మక రక్షణ చర్యల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.

Trump ordered killing of Iran Guards commander Pentagon
'ఇరాన్​ గార్డ్స్​ కమాండర్​ని చంపమని ట్రంప్​ ఆదేశించారు'

By

Published : Jan 3, 2020, 9:23 AM IST

Updated : Jan 3, 2020, 9:39 AM IST

ఇరాక్​ రాజధాని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం రాకెట్​ దాడిపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసీం సోలేమనీని మట్టుబెట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆదేశించారని ఆ దేశ రక్షణ విభాగం పెంటగాన్​ వెల్లడించింది. విదేశాల్లోని అమెరికా పౌరుల రక్షణకు నిర్ణయాత్మక భద్రతా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

"ఇరాక్, దాని​ పరిసర ప్రాంతాల్లో ఉన్న అమెరికా దౌత్యవేత్తలపై దాడి చేసేందుకు జనరల్ సోలేమనీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వందలాది అమెరికా పౌరులు, భాగస్వామ్య సేవల విభాగాల సభ్యుల మరణాలకు జనరల్​ సోలేమనీ, అతని బృందమే కారణం. అంతే కాదు వారు వేలాదిమందిని గాయపరిచారు."
- అమెరికా రక్షణ విభాగం, పెంటెగాన్​

తాజాగా బాగ్దాద్​​ రాకెట్​ దాడుల్లో సోలేమనీ మృతి చెందిన క్రమంలో.. అమెరికా జాతీయ జెండాను ట్వీట్టర్​లో పోస్ట్​ చేశారు అధ్యక్షుడు ట్రంప్​.

ఇదీ చదవండి:నేడు, రేపు కేంద్ర మంత్రిమండలి కీలక భేటీ!

Last Updated : Jan 3, 2020, 9:39 AM IST

ABOUT THE AUTHOR

...view details