తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ సంబురాలు అమెరికాలో ఘనంగా జరిగాయి. తెరాస యూఎస్‌ఏ ఎన్నారై విభాగం– మాటా ఆధ్వర్యంలో మిన్నెసొటాలోని ఎడెన్‌ప్రయరీలో ఈ వేడుకలు నిర్వహించారు. తెరాస ఎన్నారై విభాగం ప్రతినిధి ఎర్రబెల్లి ప్రేమ్, తెరాస ఎన్నారై యూఎస్‌ఏ ప్రాంతీయ ప్రతినిధి కాచం జ్ఞానేశ్వర్, ఉపాధ్యక్షుడు చేపూరి భవానీ రామక్రిష్ణ, మాటా వ్యవస్థాపకుడు అల్లమనేని నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో తెలంగాణ రైతుల చిరకాల వాంఛ నెరవేరుతుందని వారు అన్నారు. తెరాస ఎన్నారై విభాగం తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అమెరికాలో తెరాస ఎన్నారై విభాగం సంబురాలు - kcr
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ సంబురాలు అమెరికాలో ఘనంగా జరిగాయి. తెరాస యూఎస్‌ఏ ఎన్నారై విభాగం-మాటా ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.
అమెరికాలో తెరాస ఎన్నారై విభాగం సంబురాలు