క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ.. ఆఫ్రికాలోని చైల్డ్ హుడ్ క్యాన్సర్ అసోసియేషన్‌కు నిధులు సమీకరించేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకొచ్చారు. ఇండో ఆఫ్రికా మీడియా కంపెనీ ఆధ్వర్యంలో దక్షిణాఫ్రికా డర్బన్‌లో తొలిసారిగా క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ ఈ విషయాల్ని వెల్లడించాడు.
మే18న సాంస్కృతిక కార్యక్రమంతో పాటు.. 19వ తేదీన తెలుగు సినిమా అకాడమీ, హైదరాబాద్ తల్వార్స్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగనున్నాయని హీరో శ్రీకాంత్ తెలిపాడు. దీని ద్వారా వచ్చే నిధులు చైల్డ్ హుడ్ క్యాన్సర్ అసోసియేషన్‌కు అందించనున్నట్లు వివరించాడు.