తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అమెరికాలో తెలుగు కుటుంబం అనుమానాస్పద మృతి - guntur

అమెరికాలోని అయోవా రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. తెలుగు కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో  మృతి చెందారు. వెస్ట్​ డి మాయిన్​ నగరంలో ఈ ఘటన జరిగింది.

అమెరికాలో తెలుగు కుటుంబం అనుమానస్పద మృతి

By

Published : Jun 17, 2019, 6:24 AM IST

Updated : Jun 17, 2019, 8:46 AM IST

అమెరికాలోని అయోవా రాష్ట్రంలో తెలుగు కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరిని సుంకర చంద్రశేఖర్​, సుంకర లావణ్యగా గుర్తించారు. వీరితో పాటు ఇద్దరు బాలుర మృతదేహాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. అన్ని మృతదేహాలపై తూటా గాయాలున్నాయి. మరణాలకు గల కారణాలు గుర్తించేందుకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుడు చంద్రశేఖర్​ ఏపీలోని గుంటూరు జిల్లా చుండూరులో చదువుకున్నారు. అనంతరం చదువు నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడాడు. అతని తల్లిదండ్రులు హైదరాబాద్​లో ఉంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

అమెరికాలో తెలుగు కుటుంబం అనుమానాస్పద మృతి
Last Updated : Jun 17, 2019, 8:46 AM IST

ABOUT THE AUTHOR

...view details