రెండు రోజుల క్రితం నారాయణపేట జిల్లా తీలేరులో పది మంది ఉపాధి మహిళ కూలీలు మృతి చెందిన ఘటనపై న్యాయ విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని లీగల్‌సెల్ న్యాయమూర్తి చంద్రశేఖర్ పరిశీలించారు. దుర్ఘటన జరిగిన ప్రాంతం.. ఏ గ్రామం పరిధిలోకి వస్తుంది? కూలీలు ఎందుకు అక్కడికి వెళ్ళవలసి వచ్చింది? ప్రమాదానికి కారణాలేంటి అనే కోణంలో విచారణ చేపట్టారు. ఉపాధి హామీ పథకం అధికారులతో పాటు, ప్రత్యక్ష సాక్షులు, గ్రామ సర్పంచ్ రేవతమ్మ ఆధ్వర్యంలో విచారణ జరిగింది.
తీలేరు ఘటనపై న్యాయ విచారణ ప్రారంభం - theeleru
నారాయణపేట జిల్లా తీలేరులో జరిగిన విషాదంపై క్షేత్రస్థాయిలో న్యాయ విచారణ ప్రారంభం అయింది. మట్టి దిబ్బలు మీద పడి పది మంది ఉపాధి కూలీలు అక్కడికక్కడే మృతి చెందిన స్థలాన్ని లీగల్ సెల్ న్యాయమూర్తి చంద్రశేఖర్ పరిశీలించారు.
తీలేరు ఘటనపై న్యాయ విచారణ
గ్రామంలో జరిగిన విషాద సంఘటనపై పూర్తి స్థాయిలో విచారించి ప్రమాదానికి గల కారణాలు, సంబంధిత బాధ్యులెవరు అనేదానిపై జిల్లా ప్రధాన న్యాయమూర్తికి నివేదికను అందజేస్తామని తెలిపారు.
ఇవీ చూడండి:స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ గురి