టీఆర్టీ అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యాశాఖలో ఏడేళ్లుగా పెండింగ్లో ఉన్న భార్యా, భర్తల అంతర్ జిల్లా బదిలీలకు అవకాశం ఇవ్వాలని, మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయుల బదిలీలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. పండిట్, పీఈటీ పోస్టులతో సహా గత ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్ ప్రక్రియను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం వారికి నియామక ఉత్తర్వులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు హాజరయ్యారు.
'టీఆర్టీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిచాలి' - 'టీఆర్టీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిచాలి'
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నేతలు విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని కలిశారు. టీఆర్టీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు పాఠశాలలు పున:ప్రారంభమయ్యేలోగా నియామక పత్రాలు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
'టీఆర్టీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిచాలి'