తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తాడిపత్రిలో వైసీపీ దాడిలో తెదేపా నాయకుడు మృతి.. - godava

అనంతపురం జిల్లాలో పోలింగ్‌ సందర్భంగా భయానక ఘటనలు నెలకొన్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలో వైకాపా బీభత్సం సృష్టిస్తోంది. మీరాపురంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దాడిలో తెదేపా నాయకుడు సిద్ధా భాస్కర్‌రెడ్డి చనిపోయారు.

గాయపడిన వ్యక్తి

By

Published : Apr 11, 2019, 1:52 PM IST

తాడిపత్రి రణరంగం.. వైసీపీ దాడిలో తెదేపా నేత మృతి..

ఏపీలో ఎన్నికల పోలింగ్.. హింసాత్మకంగా మారింది. అనంతపురం జిల్లాలో వైకాపా నాయకుల దాడిలో తెదేపా నేత సిద్ధా భాస్కర్ రెడ్డి తీవ్ర గాయాలతో చనిపోయారు. తాడిపత్రిలో జరిగిన ఈ ఘటన.. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసింది. ప్రత్యర్థుల దాడిలో తీవ్ర గాయాలపాలైన సిద్ధాను.. ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారని వైద్యులు తెలిపారు.

రాప్తాడు నియోజకవర్గంలోనూ వైకాపా నేతలు దౌర్జన్యం సృష్టిస్తున్నారు. సిద్ధరాంపురం గ్రామంలో పోలింగ్‌ కేంద్రంలోనే ఘర్షణ చోటుచేసుకుంటుంది. తెదేపా, వైకాపా వర్గీయులు కర్రలతో కొట్టుకున్నారు. తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణలో 10 మందికి గాయాలయ్యాయి. సనప గ్రామంలో వైకాపా కార్యకర్తల దాడిలో ఆరుగురు తెదేపా కార్యకర్తలకు గాయాలపాలయ్యారు. ఇవీ చూడండి: ఓటు వేసిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details