కరీంనగర్ జిల్లా గుండ్లపల్లిలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో స్వచ్ఛ గురుకులం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా స్వేరోస్ అధ్యక్షుడు ప్రభాకర్, కరీంనగర్ జిల్లా స్వేరోస్ అధికార ప్రతినిధి యాదగిరి, ప్రధాన కార్యదర్శి బాబు పాల్గొన్నారు. గురుకుల ప్రాంగణంలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను విద్యార్థులు తొలగించారు. చెత్తా, చెదారాన్ని శుభ్రం చేశారు. విద్యార్థులు శుభ్రంగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామని సిద్దిపేట జిల్లా స్వేరోస్ అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు.
'స్వచ్ఛ గురుకులంతో ఆరోగ్యంగా ఉందాం' - swaccha bharat programme conducted at gurukula residential school
మనం శుభ్రత పాటిస్తూ... పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామన్న నినాదంతో గుండ్లపల్లి ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలతో స్వచ్ఛ గురుకులం నిర్వహించారు.
swaccha bharat programme conducted at gurukula residential school