తెలంగాణ

telangana

By

Published : Apr 7, 2019, 11:13 AM IST

ETV Bharat / briefs

సూర్య కొత్త సినిమా.. రేపటి నుంచి షూటింగ్

'గురు'తో హిట్ కొట్టిన సుధా కొంగర.. హీరో సూర్యతో సినిమా చేయనున్నారు. లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం రేపటి నుంచి షూటింగ్ జరుపుకోనుంది.

సూర్య కొత్త చిత్రం..రేపటి నుంచి షూటింగ్

విభిన్న చిత్రాలు చేయడంలో హీరో సూర్య ఎప్పుడూ ముందుంటాడు. అతడి సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ విడుదలవుతుంటాయి. తాజాగా 'గురు' ఫేం సుధా కొంగర దర్శకత్వంలో నటించనున్నాడు. సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హీరో కార్తీతో పాటు చిత్రబృందం హాజరైంది. రేపటి నుంచి షూటింగ్ జరుపుకోనుందీ చిత్రం.

లాంఛనంగా మొదలైన సూర్య కొత్త సినిమా

అపర్ణ బాలమురళి హీరోయిన్​గా కనిపించనుంది. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం కె.వి ఆనంద్ తెరకెక్కిస్తున్న 'కాప్పన్' సినిమాలో సూర్య నటిస్తున్నాడు. ఇతర పాత్రల్లో మోహన్​లాల్, ఆర్య, సాయేషా సైగల్ కనిపించనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details