తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కుక్కర్​ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నై - 'pressure cooker' symbol

ఆర్కే నగర్​ ఉపఎన్నికల్లో ప్రెషర్​ కుక్కర్​ గుర్తుపై పోటీ చేసి, ఘన విజయం సాధించారు దినకరన్. ఇప్పుడు అదే గుర్తుకోసం న్యాయపోరాటం చేస్తున్నారు.

కుక్కర్​ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నై

By

Published : Feb 7, 2019, 5:22 PM IST

తమిళనాడులో టీటీవీ దినకరన్​ నేతృత్వంలోని 'అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం'(ఏఎమ్​ఎమ్​కే)కి 'ప్రెషర్​ కుక్కర్​' గుర్తును ఇప్పటికిప్పుడే కేటాయించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

గతేడాది మార్చి 9న దిల్లీ హైకోర్టు దినకరన్​ కూటమికి ఒక సాధారణ గుర్తును కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అది 'ప్రెషర్ కుక్కర్' గుర్తు అయినా ఫర్వాలేదని వ్యాఖ్యానించింది.

నాలుగు వారాల్లోగా దిల్లీ హైకోర్టు 'ఎన్నికల గుర్తు' కేసు విచారణను పూర్తిచేయకపోతే.... 2018 మార్చి 9 తీర్పును ఎన్నికల సంఘం అనుసరించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. తమిళనాడులో ఖాళీ అయిన స్థానాలకు నాలుగు వారాల్లోగా ఎన్నికలు నిర్వహించదలిచినా... దినకరన్​ పార్టీకి ప్రెషర్​ కుక్కర్​ గుర్తును కేటాయించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది.

జయలలిత మరణం అనంతరం అన్నాడీఎంకే మొదలైన వర్గపోరు... చివరకు న్యాయపోరాటంగా మారింది. అన్నాడీఎంకే గుర్తయిన రెండాకుల గుర్తు కోసం దినకరన్​ వర్గం న్యాయస్థానాల్ని ఆశ్రయించింది. ఇప్పుడు తాజాగా ప్రెషర్​ గుర్తు కేటాయించాలని కోర్టును కోరింది.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఖాళీ ఏర్పడిన రాధాకృష్ణన్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో దినకరన్​ పార్టీ ప్రెషర్ కుక్కర్​ గుర్తుపై పోటీచేసి 40 వేల మెజారిటీతో గెలిచింది.

ABOUT THE AUTHOR

...view details