ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తన సందర్శకుల జాబితాలో గాయని సునీత కూడా ఉన్నారన్న వ్యాఖ్యపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. అంత గొప్ప వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. ఇలా ప్రతి ఒక్కరు తన పేరు వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగర్ సునీతకు కోపమొచ్చింది! - విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి
"ప్రతిరోజు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ జీవితంలో ఎదగడానికి ప్రయత్నిస్తుంటాం. ఈ క్రమంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా సూటిపోటి మాటలతో బాధపెడుతుంటారు. నేనెప్పుడూ అలాంటివి పట్టించుకోకుండా ముందుకెళ్లాలనుకుంటా. కానీ కొన్నిసార్లు మాత్రం స్పందించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది అందుకే స్పందించాను." - సునీత, గాయని
సింగర్ సునీతకు కోపమొచ్చింది!