శనివారం.. వైకాపా శాసనసభాపక్ష సమావేశం - వైవీ సుబ్బారెడ్డి
శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్లో వైకాపా శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఇవాళ సాయంత్రం జగన్ మీడియాతో మాట్లాడనున్నట్లు ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
వైకాపా శాసనసభాపక్ష సమావేశం
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టిస్తున్న వైకాపా.. తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఏపీలో అధికారం ఖాయమన్న ఫలితాల అంచనాలతో.. శాసనసభాపక్ష సమావేశానికి సిద్ధమయ్యారు. శనివారం ఉదయం వైకాపా తాజా ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇవాళ సాయంత్రం జగన్ మీడియాతో మాట్లాడతారన్నారు. తెదేపా పాలన నచ్చకే.. ప్రజలు వైకాపాను గెలిపించారని చెప్పారు.