టీవీ 9 షేర్ల వివాదంలో తనపై నమోదైన కేసు కొట్టివేయాలని నటుడు శివాజీ హైకోర్టును ఆశ్రయించారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ... క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏబీసీఎల్ 40వేల షేర్ల కొనుగోలు కోసం రవిప్రకాశ్‌కు గతేడాది ఫిబ్రవరి 19న రూ. 20 లక్షలు బ్యాంకు ద్వారా చెల్లించినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్సీఎల్టీలో వివాదం తేలిన తర్వాత షేర్ల బదిలీ చేస్తానని రవిప్రకాశ్ చెప్పారని శివాజీ తెలిపారు. రవిప్రకాశ్‌తో లావాదేవీలు కుట్ర పూరితమంటూ.. అందిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు తనపై కేసు నమోదు చేశారన్నారు. కనీసం విచారణ జరపకుండా.. కేసు నమోదు చేశారని ఆరోపించారు.
నాపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయండి: శివాజీ - shivaji
టీవీ 9 షేర్ల వివాదంలో హైకోర్టును ఆశ్రయించారు నటుడు శివాజీ. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
ఎఫ్ఐఆర్ను కొట్టివేయండి: శివాజీ