అంతర్జాతీయ క్రికెట్ మండలి నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా మను సాహ్నీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పదవిలో ఉన్న డేవ్ రిచర్డ్‌సన్‌తో కలిసి పనిచేయనున్నారు. వన్డే ప్రపంచకప్ అనంతరం ఆ పదవి నుంచి వైదొలగనున్నారు రిచర్డ్సన్. సాహ్నీ..ఈఎస్పీఎన్ స్టార్‌స్పోర్ట్స్‌కు ఎండీగా పనిచేశారు.
సాహ్నీ నియామకాన్ని ఐసీసీ అపెక్స్ బాడీ ఛైర్మన్ శశాంక్ మనోహర్‌తో పాటు బోర్డు సభ్యులందరూ ఆమోదించారు. ఆయన గత ఆరు వారాలుగా రిచర్డ్‌సన్‌తో కలిసి ప్రయాణిస్తున్నారు.