తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఆటలకే వాడుకుందాం... సమావేశాలకు వద్దు... - COACHES

ఎల్బీ స్టేడియాన్ని కాపాడాలని బషీర్​బాగ్​లో క్రీడాకారులు, కోచ్​లు ఆందోళన చేపట్టారు. పలు రాజకీయ పార్టీల బహిరంగ సమావేశాలతో మైదానం పాడవుతోందని ఆరోపించారు. లాల్​బహుదూర్​ స్టేడియం ముందు నిరసనకు దిగిన క్రీడాకారులను సైఫాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు.

ఆటలకే వాడుకుందాం...

By

Published : May 27, 2019, 11:14 AM IST

ఆటలకే వాడుకుందాం...
హైదరాబాద్ ఎల్బీ స్టేడియాన్ని పరిరక్షించాలని బషీర్ బాగ్​లో క్రీడాకారుల కోచ్​లు నిరసనకు దిగారు. వివిధ రాజకీయ పార్టీల బహిరంగ సమావేశాలు, విందులు, వినోదాలు, సభలకు అనుమతించవద్దని డిమాండ్ చేశారు. 1967లో నగరం నడిబొడ్డున లాల్ బహుదూర్ స్టేడియం నిర్మించారని... అప్పటి నుంచి ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘనత ఈ మైదానానికి ఉందన్నారు. సమావేశాలకు ఇవ్వడం వల్ల మైదానం మొత్తం పాడైపోయి క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజ్ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్ స్థలాలను సమావేశాలకు వినియోగించుకోవాలని కోరారు. ఎల్బీ స్టేడియం ముందు బైఠాయించడం వల్ల బేగం బజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్​తో పాటు పలువురు క్రీడాకారులను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఇవీ చూడండి: శ్రీవారిని దర్శించుకున్న గులాబీ అధినేత

ABOUT THE AUTHOR

...view details