తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఎన్నికల్లో పోటీ చేస్తాననేది వదంతే : సంజయ్ దత్ - సంజయ్ దత్

లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడనే వార్తలపై సంజయ్​ దత్ స్పందించాడు. అవన్నీ పుకార్లేనని ట్విట్టర్​ వేదికగా స్పష్టం చేశాడు.

ఎన్నికల్లో పోటీ చేస్తాననేది వదంతేనని కొట్టిపారేసిన సంజయ్ దత్

By

Published : Mar 26, 2019, 3:19 PM IST

రానున్న లోక్​సభ ఎన్నికల్లో సంజయ్ దత్ పోటీ చేస్తున్నాడనే వార్తలు కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ ట్విట్టర్​లో స్పందించాడీ బాలీవుడ్ హీరో. అవన్నీ వదంతులేనని కొట్టి పారేశాడు.

తన​ తండ్రి, దివంగత ఎంపీ సునీల్ దత్ అడుగుజాడల్లో ఘజియాబాద్​ నుంచి సంజయ్​ దత్​ పోటీ చేయనున్నాడనే వార్తలు కొద్దికాలం నుంచి వినిపిస్తున్నాయి. అవన్నీ నిజం కాదని... ట్విట్టర్​ వేదికగా సంజయ్ దత్ ధ్రువీకరించాడు.

ట్విట్టర్​లో స్పందించిన హీరో సంజయ్ దత్

లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేస్తాననేది నిజం కాదు. ఎన్నికల్లో నిలబడిన నా సోదరి ప్రియాదత్​కు పూర్తి సహకారం అందిస్తాను. ప్రతిఒక్కరూ ఓటును వినియోగించుకోండి" -సంజయ్ దత్, బాలీవుడ్ నటుడు

ABOUT THE AUTHOR

...view details