ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన జ్ఞాపికల వేలం పాట ముగిసింది. రూ.వేలల్లోని జ్ఞాపికలు రూ.లక్షలు పలికాయి. రెండు వారాల పాటు సాగిన వేలంలో ఎంత డబ్బు వచ్చిందో ప్రధాని కార్యాలయం వెల్లడించలేదు.
ఈ డబ్బును కేంద్ర ప్రభుత్వం గంగానది ప్రక్షాళకోసం ఉద్దేశించిన 'నమామి గంగే' ప్రాజెక్టుకు ఖర్చుచేయనున్నారు.
1,800 జ్ఞాపికలు వేలంపాటలో ప్రజలు కొనగోలు చేసినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. రూ.5 వేల విలువ చేసే శివుని విగ్రహం 10లక్షలు పలికింది. అంటే అసలు ధరకు 200 శాతం అధికం.
చెక్కతో చేసిన అశోక స్తంభం జ్ఞాపిక... అసలు ధర 4 వేలు కాగా...13 లక్షలకు విక్రయించారు.