దైవదర్శనానికి వెళ్లి వచ్చేసరికి దొంగలు ఇల్లు గుల్ల చేసిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. కూకట్పల్లి సంగీత్నగర్లోని సాయిరాం నిలయంలో మాధవిలత తన పిల్లలతో నివాసం ఉంటోంది. భర్త సుబ్రహ్మణ్య శాస్త్రి ఉద్యోగ నిమిత్తం విదేశాల్లో ఉంటున్నాడు. గురువారం ఉదయం మాధవిలత ఇంటికి తాళం వేసి కుటుంబంతో చిలుకూరు బాలాజీ దర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. పోలీసులకు సమాచారం అందించగా... సంఘటనా స్థలానికి చేరుకుని వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దైవదర్శనానికి వెళ్తే.. ఇల్లు గుల్ల - మాధవిలత
చిలుకూరు బాలజీని దర్శించుకోవడానికి వెళ్తే... దొంగలు ఓ ఇంటిని గుల్ల చేశారు. విలువైన ఆభరణాలు, సామగ్రి ఎత్తుకెళ్లిన ఘటన హైదరాబాద్ కూకట్పల్లిలో చోటుచేసుకుంది.
ఇల్లు గుల్ల
అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా.. గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించినట్లు వీడియోలో తేలింది. దొంగ ఇంటి తాళాలు పగలగొట్టి ఏడు తులాల బంగారు ఆభరణాలు, వెండి సామగ్రి, రూ. లక్షా 50 వేల నగదు ఎత్తుకెళ్లారని బాధితురాలు తెలిపారు.
ఇవీ చూడండి: నూతన భవన నిర్మాణాల కేసు జులై8కి వాయిదా