తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సెప్టెంబర్​లోగా అర్బన్​ భగీరథ పూర్తవ్వాలి

అర్బన్ మిషన్ భగీరథలో భాగంగా నిర్మిస్తున్న ఓవర్​హెడ్ ట్యాంక్​లన్నింటినీ పూర్తి చేసి సెప్టెంబర్​ చివర్లోగా అందుబాటులోకి తేవాలని పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

By

Published : Jun 11, 2019, 8:51 PM IST

భగీరథ పూర్తవ్వాలి

అర్బన్ మిషన్ భగీరథ, అమృత్, పట్టణాభివృద్ధి ప్రాజెక్ట్ పనుల పురోగతులపై పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్​ కుమార్​ సమీక్ష నిర్వహించారు. అమృత్ కింద 1550 కోట్ల రూపాయలతో పది పట్టణాల్లో చేపట్టిన మంచినీటి పథకాలు 85 శాతం పూర్తయ్యాయని తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, అధికారులతో సమావేశమై ఎస్సార్డీపీ పథకంలో చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు.

ప్రపంచ బ్యాంక్​ సాకారంతో...

ప్రపంచ బ్యాంకు నిధులతో పట్టణాభివృద్ధి ప్రాజెక్ట్ ద్వారా ఆర్మూర్, మణుగూరు, జమ్మికుంటలో చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. హుజురాబాద్, మెదక్, కొత్తగూడెం, కొల్లాపూర్​లలో పనులు కొనసాగుతున్నాయని... వచ్చే నెల మొదటి వారం నుంచి అన్ని పట్టణాల్లో పర్యటించి పనుల పురోగతిని పరిశీలిస్తానని అరవింద్ కుమార్ పేర్కొన్నారు.

సెప్టెంబర్​లోగా అర్బన్​ భగీరథ పూర్తవ్వాలి

ఇవీ చూడండి: రవిప్రకాశ్​ బెయిల్​ పిటిషన్​ విచారణ మళ్లీ వాయిదా

ABOUT THE AUTHOR

...view details