హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాల్లో నిర్భంద పాఠ్యాంశం చేయాలన్న కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది మా అస్తిత్వంపై దాడి అని ఉద్ఘాటించారు. దేశంలోనే ఎక్కువ మంది మాట్లాడే రెండో భాషగా ఉన్న తెలుగు పాలకుల నిర్లక్ష్యం వల్లే మూడో స్థానానికి దిగజారిపోయిందని ఆరోపించారు. హిందీ రాష్ట్రాల్లో తెలుగు భాషను కూడా నిర్భందం చేయగలరా అంటూ ట్వీట్ చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి. హిందీని మాపై రుద్దాలన్న ప్రతిపాదనపై కేంద్రం వెంటనే వివరణ ఇవ్వాలని కోరారు.
ఆ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా : రేవంత్ రెడ్డి - congress mp
దక్షిణాది రాష్ట్రాల్లో హిందీని నిర్భంద పాఠ్యాంశం చేయాలని కస్తూరి రంగన్ కమిటీ చేసిన సిఫార్సుపై ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
ఆ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా : రేవంత్ రెడ్డి