ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో కేశవదాసుపాలెంలో ఓఎన్జీసీ పైపులైను సోమవారం ఉదయం రెండు చోట్ల లీకైంది. పైపులైన్ నుంచి సహజవాయువు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కేసవదాసుపాలెంలోని బెల్లంకొండ గ్రూప్ పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో గ్యాస్ లీకవటం స్థానికులు గమనించారు. మోరీ జీసీఎస్ పాయింట్ పైప్‌లైన్‌లోనూ లీకేజీ జరిగింది. విషయం తెలుసుకున్న జీసీఎస్ అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని లీకేజీలను నియంత్రించారు. పాత పైపులైన్లను డమ్మీ చేసి కొత్తగా 12 పైపు లైన్లు వేశామని, డమ్మీ చేసిన చోట చిల్లు పడినందున గ్యాస్ పాత పైపులైన్లోకి వచ్చి వాటికి ముందున్న లీకుల్లో కొద్దిగా బయటకు వచ్చిందని ఓఎన్జీసీ అధికారులు తెలిపారు. దీని వల్ల ప్రమాదమేమి లేదని అన్నారు. అయితే లీకేజీల వల్ల పంటలు దెబ్బతింటున్నాయని... సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు డిమాండ్ చేశారు.
రెండు చోట్ల లీకైన ఓఎన్జీసీ గ్యాస్ పైపులైను - two places
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో రెండు చోట్ల ఓఎన్జీసీ పైపులైను లీకైంది. వాటిని చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సత్వరమే అధికారులు స్పందించినందున ఎలాంటి ప్రమాదం జరగలేదు.
రెండు చోట్ల లీకైన ఓఎన్జీసీ గ్యాస్ పైపులైను