తెలంగాణ

telangana

ETV Bharat / briefs

10 ఓవర్లకు ఆర్సీబీ - 73/2... కోహ్లీ, ఏబీ​ ఔట్​ - match

జయపుర వేదికగా రాజస్థాన్​తో జరుగుతున్న మ్యాచ్​లో బెంగళూరుకు శుభారంభం దక్కింది. అయితే తక్కువ సమయంలో కోహ్లీ, డివిలియర్స్​ వికెట్లను కోల్పోయింది.

విరాట్

By

Published : Apr 2, 2019, 8:43 PM IST

రాజస్థాన్​తో జరుగుతున్న మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుకు శుభారంభం దక్కింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగింది బెంగళూరు జట్టు. తొలి6 ఓవర్లలో 48 పరుగులు సాధించింది కోహ్లి- పార్ధివ్ జోడి. ఆడిన మూడు మ్యాచ్​ల్లోనూ పరాజయం చెందిన కోహ్లిసేన గెలవాలనే పట్టుదలతో బరిలో దిగింది.

అయితే స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లను కోల్పోయింది బెంగళూరు జట్టు. కోహ్లిని (23) బౌల్డ్ చేశాడు రాజస్థాన్ బౌలర్ శ్రేయాస్ గోపాల్. తర్వాత క్రీజులోకి వచ్చిన డివిలియర్స్​ 13 పరుగులకే వెనుదిరిగాడు. ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 73పరుగులతో ఆర్సీబీ ఆడుతోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details