తమిళనాడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు తలైవా రజనీకాంత్. 2017 డిసెంబర్ 31న రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసిన ఆయన ఇప్పటి వరకు పార్టీ ఏర్పాటు చేయలేదు. ఉపఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వనున్నారో తెలపలేదు రజనీకాంత్. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమని ఇటీవలే వెల్లడించారు రజనీ. తమిళనాడు నీటి సమస్యను తీర్చే పార్టీకే తన మద్దతుంటుందని ఇటీవల ఓ ప్రకటన చేశారు.
ఉపఎన్నికల్లో పోటీకి తలైవా దూరం - తలైవా
తమిళ తలైవా రజనీకాంత్ ప్రస్తుతం జరిగే అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యమని ప్రకటించారు.
ఉపఎన్నికల్లో పోటీకి తలైవా దూరం
తమిళనాడులోని అతిపెద్ద సమస్య నీటి ఎద్దడేనని పేర్కొన్నారు రజనీ. గతంలోనూ నదుల అనుసంధానాన్ని సమర్థిస్తానని పేర్కొన్నారాయన. రాజకీయ ప్రచారానికి తన చిత్రాల్ని, తన అభిమాన సంఘం 'రజనీ మక్కల్ మండ్రం' పతాకాన్ని వాడొద్దని పిలుపునిచ్చారు రజనీ కాంత్.
ఇదీ చూడండి:భారత్... పాక్... ఓ ప్రేమ వివాహం