తెలంగాణ

telangana

ETV Bharat / briefs

"మసూద్​ను విడిచిపెట్టింది మీరు కాదా..?"

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్​ను విడిచిపెట్టింది భాజపా ప్రభుత్వమేనని కాంగ్రెస్ అధినేత  రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత జైల్లో శిక్ష అనుభవిస్తున్న మసూద్​ను అప్పటి భాజపా ప్రభుత్వం విడిచిపెట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

మోదీపై రాహుల్ విమర్శలు

By

Published : Mar 9, 2019, 7:52 PM IST

భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. జైషే మహ్మద్ నాయకుడు మసూద్​ అజార్​ను భాజపా ప్రభుత్వమే విడిచిపెట్టిందన్నారు రాహుల్. 1999వ సంవత్సరంలో ఓ విమానాన్ని హైజాక్​ చేసి ఉగ్రవాదులు మసూద్​ను విడిపించుకున్నారని ప్రస్తావించారు. కర్ణాటక లోని హవేరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీపై రాహుల్ విమర్శలు

"భారత జైలు నుంచి మసూద్ అజార్​ను ఎవరు పంపారో ప్రకటించండి. భాజపా ప్రభుత్వమే మసూద్​ను సాగనంపింది. అప్పటి విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారుతో మసూద్​ను కాందహార్​ విమానాశ్రయానికి పంపించలేదా.. మీరు మరచిపోయారా?...మీ ప్రభుత్వమే మసూద్​ను పాక్​కు అప్పగించింది. అంతర్జాలంలో చూస్తే కాందహార్ విమానాశ్రయంలో మసూద్​ అజార్​తో అజిత్​ డోభాల్​ ఉన్న చిత్రం కనిపిస్తుంది. మేం మీలా కాదు.. ఉగ్రవాదానికి మేం తలవంచం. మసూద్​ను ఎవరి ప్రభుత్వంలో అప్పగించారో మీరే దేశానికి చెప్పండి."-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

మోదీ ఎప్పుడూ అవినీతి గురించి మాట్లాడుతుంటారని కానీ ఆయనే పెద్ద అవినీతిపరుడని ఎద్దేవా చేశారు రాహుల్. మేకిన్ ఇండియా, స్టాండప్ ఇండియా, సిట్​ డౌన్ ఇండియా అంటూ గత ఐదేళ్లుగా ప్రజల్ని కల్లబుల్లి మాటలతో మోసగించారని ఆరోపించారు. 15 నుంచి 20 మంది వ్యాపారవేత్తల మేలు కోసమే మోదీ తాపత్రయమని రాహుల్ విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details