ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటలకే ముగిసినా.. అప్పటివరకూ క్యూలైన్లో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ ముగిసేసరికి ఏపీ వ్యాప్తంగా 76.69శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా విజయనగరం, ప్రకాశం జిల్లాలో 85 శాతం నమోదుకాగా.. అత్యల్పంగా కడప, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో 70 శాతం పోలింగ్ నమోదైంది. అన్ని జిల్లాల్లో 70 శాతం నమోదవడం విశేషం.
జిల్లాలవారీగా పోలింగ్ శాతం
శ్రీకాకుళం-72
విజయనగరం-85
విశాఖ-70
తూర్పుగోదావరి-81
పశ్చిమగోదావరి-70
కృష్ణా-79
గుంటూరు-80
ప్రకాశం-85
నెల్లూరు-75
కడప -70
కర్నూలు -73
అనంతపురం-78
చిత్తూరు -79
ఆంధ్రప్రదేశ్లో 76.69 శాతం పోలింగ్ నమోదు - percentage
ఏపీలో పోలింగ్ ముగిసింది. మొత్తం 76.69 శాతం పోలింగ్ శాతం నమోదైంది. అన్ని జిల్లాల్లో 70 శాతానికిపైగా పోలింగ్ జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో 76.69 శాతం పోలింగ్ నమోదు
ఇవీ చదవండి..ఉద్యమాల ఖిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్