రాహుల్ గాంధీకి 'రఫేల్ ఫోబియా': రవిశంకర్ ప్రసాద్ - రాహుల్
రఫేల్ ఒప్పందంపై రాహుల్ చేస్తోన్న విమర్శలపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. నెహ్రూ, పటేల్, రాజాజీ, కామరాజ్ లాంటి వారు అధ్యక్షుడిగా ఉన్న పార్టీకి రాహుల్ అధ్యక్షుడిగా ఉండి ఇలా మాట్లాడతారా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
"రాహుల్ గాంధీకి రఫేల్ఫోబియా పట్టింది. ప్రధానికి వ్యతిరేకంగా రాహుల్ వాడుతోన్న భాష ఆక్షేపనీయం. తన తండ్రిపై బోఫోర్స్‌కు సంబంధించి ఎన్ని కేసులు ఉన్నాయి? ఇందిరాజీ అవినీతి రికార్డు సంగతేంటి? కానీ మేము రాహుల్ గాంధీలా అప్రజాస్వామిక భాషను ఉపయోగించట్లేదు. అబద్ధాలను బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. నెహ్రూ, పటేల్, రాజాజీ, కామరాజ్ లాంటి వారు అధ్యక్షుడిగా ఉన్న పార్టీకి రాహుల్ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటి హోదాలో ఉండి ఇంత దిగజారుడు మాటలు మాట్లాడతారా..? రఫేల్ విమానాలు యూపీయే హయాంలో కొనుగోలు చేసినదానికన్నా 9శాతం చౌకగానే కొన్నాం."
-రవిశంకర్ ప్రసాద్, కేంద్ర న్యాయశాఖ మంత్రి