తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మోదీతో జగన్ భేటీ... ప్రమాణస్వీకారానికి ఆహ్వానం - మోదీతో జగన్ భేటీ

ఏపీలో అద్వితీయమైన విజయం సాధించిన జగన్‌ ప్రధానితో సమావేశమయ్యారు. ఆయనకు శుభాకాంక్షలు చెప్పి... తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు.

మోదీతో జగన్ భేటీ

By

Published : May 26, 2019, 11:19 AM IST

ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి దిల్లీ వెళ్లి వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్‌ రెడ్డి... ప్రధానితో భేటీ అయ్యారు. దిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా 7రేస్ కోర్సులోని ప్రధాని నివాసానికి చేరుకున్న ఆయన... మోదీతో సమావేశమయ్యారు. ఈనెల 30న జరిగే తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలపారు. రాష్ట్రంలోని సమస్యలూ ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. జగన్​తో పాటు ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఏపీ ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాశ్​రెడ్డి, నందిగం సురేశ్, బాలశౌరి ఈ భేటీలో పాల్గొన్నారు.

మోదీతో జగన్ భేటీ

ABOUT THE AUTHOR

...view details