ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానన్న రాహుల్ గాంధీ నిర్ణయంపై దేశ వ్యాప్తంగా హస్తం పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. తెలంగాణలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సహా దేశ వ్యాప్తంగా మెుత్తం 145 మంది నేతలు రాజీనామా చేశారు. వీరిలో పీసీసీ, కార్యనిర్వాహక అధ్యక్షులు సహా పలు విభాగాల నేతలు ఉన్నారు. జులై రెండో తేదీ లోగా రాహుల్ గాంధీ తన రాజీనామా నిర్ణయాన్ని మార్చుకోకపోతే అన్ని స్థాయిల్లోని నేతలు తమ పదవుల నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. నేతలంతా రాజీనామా చేసి ఏఐసీసీ వద్ద తమ ఆవేదన తెలపాలని నిర్ణయించారు. దిల్లీలో భేటీ అయిన యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ అనుబంధ కమిటీల నేతలు ఈ మేరకు నిర్ణయించారు. ఇవాళ ఒక్క రోజే 120 మంది నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి పొన్నం రాజీనామా - Congress working president
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానన్న రాహుల్‌గాంధీ... తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి పొన్నం రాజీనామా