లోక్ సభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా భారీగా నగదు పట్టుబడుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 41.85 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. సూమారు 4 కోట్ల విలువైన 2.86 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. 2.75 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలు, 56.19 లక్షల ఇతర వస్తువులను పట్టుకున్నట్లు ఈసీ పేర్కొంది. మొత్తంగా 49.10 కోట్ల మేర అక్రమ సొత్తు తనిఖీల్లో పట్టుబడినట్లుగా ఈసీ వెల్లడించింది.
లోక్సభ ఎన్నికల వేళ... నోట్ల కట్టల కళకళ - అక్రమ నగదు
లోక్సభ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న వేళ అక్రమ నగదు, మద్యం సరఫరాపై పోలీసులు నిఘా పెంచారు. కార్లు, బస్సులు, ఆటోల్లాంటి అన్ని ప్రయాణ సాధనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే పట్టుబడ్డ అక్రమ సొత్తు సుమారు యాభై కోట్లకు చేరుకోవటం ఆశ్చర్యం కల్గించే విషయం...!
లోక్సభ ఎన్నికల వేళ... నోట్ల కట్టల కళకళ