తెలంగాణ

telangana

ETV Bharat / briefs

భూకంపాలు రాలేదే? : మోదీ

16వ లోక్​సభ చివరి సమావేశ ప్రసంగంలో కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు రాహుల్​ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు.

By

Published : Feb 13, 2019, 7:52 PM IST

రఫేల్​ యుద్ధవిమానాల ఒప్పందంపై తాను మాట్లాడితే భూకంపాలు వస్తాయని కాంగ్రెస్​ అధ్యక్షుడు అనడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొందరు భూకంపాలు సృష్టిస్తామన్నారు...కానీ అవేవీ జరగలేదని ఎద్దేవా చేశారు. కౌగిలింత, కన్ను కొట్టడం వంటి చేష్టలు లోక్​సభకు కాంగ్రెస్​ అధ్యక్షుడు పరిచయం చేశారని విమర్శించారు మోదీ.

సార్వత్రిక ఎన్నికల ముందు లోక్​సభ ఆఖరు సమావేశంలో మోదీ ప్రసంగించారు. దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తంగా పెరిగిందన్నారు.

స్పీకర్​ సుమిత్రా మహాజన్​ సభ నడిపిన తీరును ప్రశంసించారు. 17 సెషన్ల లోక్​సభలో ఎనిమిది సెషన్లు వంద శాతం ఫలప్రదమయ్యాయన్నారు.

"విశ్వవ్యాప్తంగా భారత్​కు ప్రముఖ స్థానాన్ని ఏర్పరిచాం. విదేశాల్లోని అనేక సంస్థల్లో భారత్​కు విశిష్ట స్థానం లభించింది. ప్రజాప్రయోజనాల కోసం కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ సభలో 219 బిల్లులు ప్రవేశపెడితే 203 ఆమోదం పొందాయి. ఈ సభ జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఐదేళ్ల పాటు సహాయ, సహకారాలు అందించిన సభ్యులకు కృతజ్ఞతలు." - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ABOUT THE AUTHOR

...view details