పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల సీఎస్ల భేటీ - ten days
నీటిపారుదలతో పాటు విభజన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు.. పది రోజుల తర్వాత భేటీ అయ్యే అవకాశం ఉంది. తిరుపతి వేదికగా ఈ సమావేశం జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు తిరుపతిలో పదిరోజుల తర్వాత భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. చర్చల సారాంశాన్ని అధికారులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివరిస్తారని,.. దీని తర్వాత అవసరమైతే వారిద్దరు మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి వరకు ఏపీ, తెలంగాణ అధికారుల చర్చలు కొనసాగాయి. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లు, విద్యుత్, పౌరసరఫరాలు, ఏపీ భవన్, ఉద్యోగుల విభజన అంశాలపై అధికారులు విస్తృతంగా చర్చించారు. అంశాలు, సమస్యలపై స్పష్టతకు వచ్చిన ఇరు రాష్ట్రాల అధికారులు.. ఆయా అంశాల వారీగా విడివిడిగా తదుపరి కసరత్తు చేయనున్నారు.