తెలంగాణ

telangana

ETV Bharat / briefs

దేవరకద్రలో ఘనంగా పసుపు ఉత్సవం - devarakadra

దేవరకద్రలో పసుపు పండగను కురుమ యాదవులు ఘనంగా జరుపుకున్నారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

ఘనంగా పసుపు ఉత్సవం

By

Published : Apr 24, 2019, 5:10 PM IST

Updated : Apr 24, 2019, 7:56 PM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్రలో ఎల్లమ్మ ఉత్సవాల సందర్భంగా కురుమ యాదవులు వైభవంగా నిర్వహించే బండారు ఉత్సవం ఘనంగా జరిగింది. సంతానం ఆయురారోగ్యాలతో ఉండాలని పసుపుతో బండారు ఉత్సవము నిర్వహిస్తారు. ఐదేళ్లకోసారి నిర్వహించే ఈ పసుపు పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

ఎల్లమ్మ ఆలయంలో ఈ ఉత్సవం ఘనంగా జరిగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఎల్లమ్మ ఆలయాన్ని నూతనంగా నిర్మించడం వల్ల ఐదేళ్లకు బదులుగా ఏడాదికోసారి మూడేళ్ల పాటు పండగను నిర్వహించాలని యాదవ పెద్దలు నిర్ణయించారు.

ఘనంగా పసుపు ఉత్సవం

ఇవీ చూడండి: కమిటీ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి...!

Last Updated : Apr 24, 2019, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details