ఆధార్‌తో పాన్ అనుసంధానం తప్పనిసరి ఆధార్ నంబరుతో అనుసంధానం కాని పాన్‌కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని చెప్పారు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి(సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర. ఆదాయపు పన్ను శాఖ ఇప్పటి వరకు 42 కోట్ల పాన్‌కార్డులను జారీ చేసిందని, ఇప్పటి వరకు 23కోట్ల కార్డులు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం అయినట్టు వెల్లడించారు.
మార్చి 31 తుది గడువు
ఆధార్ అనుసంధానానికి తుది గడువు ముంచుకొస్తోంది. మార్చి 31తో ముగుస్తుంది. అయినా ఇప్పటి వరకు దాదాపు 19కోట్ల మంది పాన్‌కు ఆధార్ అనుసంధానించుకోలేదు.
ఆధార్ అనుసంధానం చేయడం వల్ల నకిలీ పాన్ కార్డులను సులువుగా గుర్తించవచ్చన్నారు సుశీల్ చంద్ర. ఎవరైనా ఆధార్‌తో అనుసంధానం చేయించుకోకపోతే ఆ కార్డులు మార్చి 31 తర్వాత రద్దు కావొచ్చని చెప్పారు.
ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ఇప్పటికే ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. అదేవిధంగా పాన్‌కార్డుకు ఆధార్ అనుసంధానానికి మార్చి 31 వరకు గడువిచ్చింది.
ఆధార్‌కార్డుకు రాజ్యాంగబద్ధత ఉందని సుప్రీంకోర్టు గతేడాది సెప్టెంబర్‌లో తీర్పునిచ్చింది.
" ఒక్కసారి ఆధార్‌తో పాన్‌కార్డు అనుసంధానం అయితే, బ్యాంకు ఖాతాలకు లింక్ అవుతుంది. అప్పుడు లావాదేవీలు, ఆస్తుల వివరాలు అన్నీ ఆదాయపు పన్ను శాఖకు తెలుస్తాయి. అలాగే అర్హులకు ప్రభుత్వ ఫలాలను, పథకాలను అందించడానికి సులువవుతుంది"
-- సుశీల్ చంద్ర, సీబీడీటీ ఛైర్మన్