తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అనాథ విద్యార్థి గృహం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం - అనాథ

అనాథ విద్యార్థి గృహంలోని ప్రవేశాలకు 2019-20 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అనాథ విద్యార్థి గృహం కార్యదర్శి తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు జూన్​ ఐదో తేదీలోగా వనస్థలీపురంలోని కార్యాలయంలో అందజేయాలన్నారు.

anaadha

By

Published : May 17, 2019, 4:13 PM IST

హైదరాబాద్​ వనస్థలీపురంలోని అనాథ విద్యార్థుల గృహంలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అనాథ, నిరుపేద విద్యార్థులు ఇంటర్మీడియట్​, డిగ్రీ , ఇతర కోర్సులు చదువుతున్న వారి నుంచి 2019-20 విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవాలని అనాథ విద్యార్థి గృహం ప్రధాన కార్యదర్శి మార్గం రాజేష్​ తెలిపారు. ప్రవేశాల కోసం అనాథ ధ్రువీకరణ, ఆర్థిక, చదువుకు సంబంధించిన పత్రాలను దరఖాస్తుతో జతచేయాలని సూచించారు. జూన్​ ఐదోతేదీలోగా వనస్థలీపురంలోని కార్యాలయంలో అందించాలన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత భోజన వసతి, బస్​పాస్​, వైద్యఖర్చులు, ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు.

అనాథ విద్యార్థి గృహం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details