నిర్మల్ జిల్లాలోని చిట్యాల సమీపంలో ఉన్న స్వర్ణవాగు వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మల్ మండలం ముజ్గి గ్రామానికి చెందిన లింగన్న తన భార్యతో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. లింగన్న ఎగిరి కారుపై పడ్డాడు. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో భయందోళనకు గురైన కారు డ్రైవర్ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. కారుపై ఉన్న లింగన్న బస్సు క్రింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై ఉన్న లింగన్న భార్యకు తీవ్ర గాయాలు కాగా... నిర్మల్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మరో వారంలో లింగన్న విదేశాలకు వెళ్లాల్సి ఉండగా... అనుకోకుండా ఇలా జరగటంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదం: వాహనదారుడు అక్కడికక్కడే మృతి - DISTRICT
పొట్ట కూటి కోసం మరో వారంలో విదేశాలకు వెళ్లాల్సిన వ్యక్తికి మృత్యువు కారు రూపంలో ఎదురొచ్చింది. ద్విచక్రవాహనంపై వస్తుండగా కారు ఢీకొనటం... ఎగిరి కారుపై పడటం... అంతలోనే బస్సు ఎదురుగా రావటం... బస్సు కిందపడి ప్రాణాలొదలటం... అంతా కనురెప్పపాటు కాలంలో జరిగిపోయింది.
ONE PERSON SPOT DEAD IN ACCIDENT IN NIRMAL DISTRICT