తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సూరీడు ప్రతాపం... మృత్యుఒడికి జనం

వేసవి తాపాన్ని తట్టుకోలేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. భానుడి ప్రతాపానికి ఇప్పటి వరకు సుమారు 200 మంది మృతి చెందినట్లు ఎమర్జెన్సీ మేనేజ్​మెంట్​ అండ్​ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​ వెల్లడించింది. నేటి నుంచి మూడు రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  హైదరాబాద్​ వాతావరణ కేంద్రం సూచించింది.

By

Published : May 19, 2019, 4:57 AM IST

Updated : May 19, 2019, 7:34 AM IST

సూరీడు ప్రతాపం... మృత్యుఒడికి జనం

సూరీడు ప్రతాపం... మృత్యుఒడికి జనం

భానుడి ధాటికి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. గత కొన్ని రోజులుగా నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండల తీవ్రత తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. ఈ వేసవిలో ఇప్పటి వరకు సుమారు 200 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో కూలీలు, ప్రయాణికులే అధికంగా ఉన్నట్లు సమాచారం.

సిద్దిపేట జిల్లాలో 150 మంది వరకు వడదెబ్బకు గురై ఆసుపత్రుల్లో చేరారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాలో సుమారు 50 మంది, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 22 మంది, ఆదిలాబాద్​లో 14 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మందికి పైగా మరణించినట్లు వైద్యారోగ్య శాఖకు చెందిన ఎమర్జెన్సీ మేనేజ్​మెంట్​ అండ్​ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​ తెలిపింది.

శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో 45.8 డిగ్రీలు, వెల్గటూరు, బీర్పూరు, మెట్​పల్లి మండలాల్లో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 45.7, హాజీపూర్​, జన్నారం మండలాల్లో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 44.4, ఖమ్మంలో 43.6, మహబూబ్​నగర్​, నల్గొండ, భద్రాచలంలో 43.4, నిజామాబాద్​, ఆదిలాబాద్​లో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి.

మూడురోజులు పాటు వడగాల్పులు

రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజులపాటు వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇవీ చూడండి: ఏకంగా ముఖ్యమంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసిన ముఠా

Last Updated : May 19, 2019, 7:34 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details